జిల్లాలో పశుగణన పూర్తి


Wed,April 17, 2019 11:47 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా నిర్వహించిన పశువుల గణనలో జిల్లాలో పశు సంపద పెరిగింది. ఆవులు, ఎద్దులు, తెల్లపశువులు 2012లో నిర్వహించిన గణనలో 2,73, 408ఉండగా.. ప్రస్తుత సర్వేలో 3,08,017 ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. అలాగే నల్ల పశువులు 2012లో 45,248 ఉండగా.. ప్రస్తుతం 47,633 ఉన్నట్లు గుర్తించారు. ఈ పశువుల సంప ద తగ్గింది. గొర్రెలు 2012లో 22,112 ఉండగా.. ప్రస్తుత సర్వేలో 1,46,009 ఉన్నట్లు గుర్తించారు. టీఆర్‌ఎస్ ప్ర భుత్వం గొల్ల, కుర్మలకు రాయితీపై గొర్రెలు అందజేయడంతో జిల్లాలో గొర్రెల సంఖ్య పెరిగింది. మేకలు 2012లో 1,06,062 ఉండ గా.. తాజాగా నిర్వహించిన సర్వేలో 1,71,992 ఉన్నట్లు తేల్చారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మేకల సంఖ్య పెరిగింది. పందులు 2012లో 1065 ఉండగా.. ప్రస్తుతం1890 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి సంఖ్య కూడా పెరిగింది. కుక్క లు 2012లో 4593 ఉండగా.. తాజాగా నిర్వహించిన సర్వేలో 5107 ఉన్నట్లు తేల్చారు. వీటి సంఖ్య కూడా పెరిగింది. కుందేళ్లు 2012లో 84 ఉండగా ప్రస్తుత సర్వేలో 5107కు చేరుకుంది. గుర్రాలు 2, గాడిదలు 34, పక్షులు 5,10,358, బాతులు 355, కోళ్లు 5,789 ఉన్నట్లు తాజా సర్వేలో అధికారులు గుర్తించారు.

కొనసాగుతున్న ఆన్‌లైన్...
జనాభా లెక్కల మాదిరిగానే పశువుల గణన కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. 2012లో పశుగణనను నిర్వహించారు. 2017 లోనే నిర్వహించాల్సిన ఈ గణన ఆలస్యమైంది.
గతంలో అధికారులు ప్రత్యేకంగా ప్రొఫార్మాను తయారు చేసుకొని మ్యానువల్‌లో పశువులకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకునే వా రు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు ప్రత్యేకంగా శిక్ష ణ ఇచ్చి ట్యాబ్‌లను అందజేశారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎన్ని పశువులు ఉన్నాయనే వివరాలను తెలుసుకున్నారు. పశువులు ఉ న్న రైతు ఆధార్ నెంబర్‌ను సైతం ఆన్‌లైన్ చేసుకొని పశువు ఫొటో తీసి అప్పటికప్పుడే జియో ట్యాగింగ్‌ను చేశారు. రైతుకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. అలాగే మత్స్యకారులకు సంబంధించిన పరికరాలను కూడా తెలుసుకొని ప్రత్యేక ప్రొఫార్మలో న మోదు చేసుకున్నారు. ఏప్రిల్‌లో అధికారులు గణనను పూర్తి చేసి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడానికి సిద్ధం చేస్తున్నా రు. వారం రోజులుగా పశువులు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, మత్స్యకారుల పరికరాలను ఆన్‌లైన్ చే స్తున్నారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా పశువుల వివరాలను ప్రకటించనున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...