మరో మూడు బీసీ గురుకులాలు!


Wed,April 17, 2019 11:46 PM

నిర్మల్ టౌన్: జిల్లాలో మరో మూడు జ్యోతిరావుఫూలే బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది! కేజీ టు పీజీ విద్య అమలులో భాగంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జిల్లాలోని వడ్యాల్(బాలుర), ఖానాపూర్(బాలికల), కుభీర్(బాలుర)లో మూడు గురుకులాలను ఏర్పాటు చేసింది. ఆయా గురుకులాల్లో 5, 6, 7,8 తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఒక్కో క్లాస్‌లో 80 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఆంగ్ల విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందిస్తుండడంతో గురుకులాల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.

తాజాగా మరో మూడు గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ముథోల్, నిర్మల్‌లో బాలికల, ఖానాపూర్‌లో బాలుర గురుకులాలు ఏర్పాటు చేసి జూన్ నుంచి ప్రారంభించేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 320 మంది విద్యార్థులు చదివే విధంగా మౌలిక వసతులు ఉన్న భవనాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన బీసీ గురుకులాలు ప్రారంభమైతే మరో వెయ్యి మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది.

జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్
నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా అధి కారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఉండడంతో పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అక్కడే శిక్షణ తరగతులు నిర్వహించాల్సి వస్తున్న ది. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాల్లో సైతం స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో, స్టడీ సర్కిల్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులున్న భవనాన్ని గుర్తించి పూర్తి వివరాలు వెంటనే అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు అధికారులు తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...