అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బైక్


Wed,April 17, 2019 11:46 PM

కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామ సమీపం లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త సంఘటన స్థలంలోనే మృతి చెందగా భార్యను దవా ఖానకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల గ్రామపంచాయతీ పరిధిలోని సోనాపూర్ తండాకు చెందిన బాలునాయక్(35) భార్యతో కలిసి ఉట్నూరుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలు దేరారు. కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ సమీపంలో ఆయన నడుపుతున్న ద్విచక్ర వాహనం రాత్రి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో బాలునాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య వీనుబాయిని, కూతురు గోదావరికి తీవ్ర గాయా లు కాగా 108 సాయంతో జన్నారం దవాఖానకు తరలించారు. స్థానికులు కడెం పోలీసులకు సమాచారం అందించగా ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బాలునాయక్ హెల్మెట్ ఉన్నప్పటికీ దానిని తలకు ధరించి ఉంటే బతికేవాడేమో అని గ్రామస్తులు అన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...