108 అంబులెన్సు ద్వారా నాణ్యమైన సేవలు


Wed,April 17, 2019 01:43 AM

ఖానాపూర్/కడెం/మామాడ: అన్ని వర్గాల ప్రజలకు జీవీకే సంస్థ 108 అంబులెన్స్ ద్వారా గణనీయ వైద్య సేవలను అందిస్తోందని ఆ శాఖ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శేక్ జాన్ షాహీద్ అన్నారు. మంగళవారం ఖానాపూర్, కడెం, మామడ మండలాల్లోని 108 అంబులేన్స్ సేవలు పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులను, గుండెపోటు వచ్చిన వారిని కాపాడుతున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తగా ఎంతో మంది గర్భిణులకు అంబులెన్స్‌లోనే తమ సిబ్బందితో సుఖవంతమైన సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో ఖానాపూర్ అంబులెన్స్ ద్వారా 96 మంది రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను దవాఖానలో చేర్పించామని ఆయన వెల్లడించారు. అనంత రం ఖానాపూర్ 108 సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంబులెన్స్‌లోని పరికరాలను పరిశీలించారు. బాధితులను తరలించే సమయంలో రోడ్డు భద్రతను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. 108లో పనిచేస్తున్న అన్ని విభాగాల సిబ్బందికి ప్రతీ ఆరు మాసాలకు ఒకసారి సంస్థాపరమైన శి క్షణ అందిస్తున్నామన్నా రు. జిల్లా కోఆర్డినేటర్ సతీశ్, 108, 102, 1962 అంబులెన్స్‌ల సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.

మామడ : మండ ల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను జీవీకే సంస్థ పోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షహీద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలు, వాటి పనితీరు పరిశీలించి లబ్ధిదారులకు అందుతున్న సేవలపై ఆరాతీశారు. అనంతరం వా హన డ్రైవర్లకు రోడ్డు భద్రత, సురక్షిత ప్రయాణంపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించ డమే జీవీకే సంస్థ లక్ష్యమని తెలిపారు. కార్య క్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ సతీశ్‌కుమార్, ఫ్లిట్ కోఆర్డినేటర్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...