శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు


Wed,April 17, 2019 01:43 AM

నిర్మల్ క్రైం: జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉత్సవాలను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ శశిధర్‌రాజు సూచించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని దేవరకోట ఆలయం వద్ద పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ గాంధీచౌక్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలను పటిష్ట పర్చేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చేపట్టే వీర హనుమాన్ యాత్రను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐలు జాన్‌దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, పారామిలటరీ బలగాలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...