ప్రశాంతంగా పాలిసెట్


Wed,April 17, 2019 01:43 AM

నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ: పాల్‌టెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి జిల్లాలో మంగళవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు జిల్లా కేంద్రంలో మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా బాలురు, బాలికలు కలిపి మొత్తం 1617 మంది హాజరు కావాల్సి ఉండగా 1569 మంది విద్యార్థులు హాజరయ్యారు. 48 మంది గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు తలత్తకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించగా గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థుల వెంట పరీక్షా కేంద్రాలకు తల్లిదండ్రులు కూడా రావడంతో పరిసర ప్రాంతాల్లో సందడి కనిపించింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతీ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఈ పరీక్షను రాష్ట్ర పరిశీలకుడు టి.రమేశ్ పర్యవేక్షించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...