పెండింగ్ పాస్‌బుక్కులను వెంటనే సరిచేసి


Wed,April 17, 2019 01:43 AM

-రైతులకు అందించండి
నిర్మల్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి రైతుకూ కొత్త పాస్‌బుక్‌లను వీలైనంత త్వరలో అందించాలని జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్, ధరణి వెబ్‌సైట్ ఆపరేటర్లతో పాస్ పుస్తకాల జారీ, పెండింగ్‌లో ఉన్న ఆన్‌లైన్ వివరాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చేపిట్టిన సమగ్ర భూ సర్వేలో ఆధారంగా రైతు ఖాతాలను గుర్తించిన అందరికీ కొత్త పాస్‌బుక్కులను అందించాలన్నారు. మొదటి విడతగా పాస్ పుస్తకాలను ఇప్పటికే పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండో విడతలో సాంకేతిక కారణాలతో కొన్ని పాస్‌పుస్తకాల జారీ నిలిచిపోగా.. మరికొన్ని భూ వివాదాల కారణంగా నిలిచిపోయినట్లు వెల్లడించారు. వాటిని వెంటనే సరిచేసి అర్హులైన రైతులకు కొత్త పాస్ పుస్తకాలను అందించాలన్నారు. అన్ని మండలాల్లో ధరణి వెబ్‌సైట్ సేవలను రైతులకు అందు బాటులోఉండేలాచూడాలన్నారు. ఎవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. దీన్ని తహసీల్దార్లు ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...