నాటు సారా స్థావరాలపై దాడులు


Wed,April 17, 2019 01:42 AM

ఖానాపూర్/మామడ : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పల్లెల్లో గుడుంబా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది. మంగళవారం భారీ స్థాయిలో గుడుంబా స్థావరాలను అధికారులు ధ్వంసం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం గోదావరి తీర ప్రాంతాన్ని ఎంచుకొన్న కొందరు తయారీ దారులు గుట్టు చప్పుడు కాకుండా తంతును సాగిస్తుండగా కనిపెట్టిన ఎక్సైజ్ శాఖ ఎస్సై రాయబారపు రవికుమార్ సిబ్బందితో గోదావరి తీరం వెంబడి వెంకటాపూర్ వరకు కాలినడకన నడుచుకుంటూ వెళ్లి తనిఖీ చేశారు. ఈ క్రమంలో డ్రమ్ముల్లో పులియబెట్టిన బెల్లం పానకం డ్రమ్ములు కనిపించాయి. దానిని ఘటనా స్థలంలోనే ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మల్ జిల్లా పరిధిలోని మారు మూల గ్రామాల సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నాటుసారా తయారీని నిరోధించే ప్రయత్నం చేయాలని కోరారు. నాటు సారా తయారీ సమాచారం ఇచ్చినా తమ సిబ్బందితో వచ్చి దాడులు నిర్వహిస్తామని, ఈ విషయంలో గ్రామ స్థాయి నాయకులందరూ తమకు సహకరించాలని సీఐ సంపత్‌కృష్ణ కోరారు. తయారీ స్థావరాలను కనుగొన్న ఎస్సై సిబ్బందిని ఎక్సైజ్ శాఖ సీఐ సంపత్‌కృష్ణ అభినందించారు. దినేష్, రాజశేఖర్‌రెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...