ఠారెత్తిస్తున్న ఎండలు..


Tue,April 16, 2019 01:29 AM

ఖానాపూర్: మండలంలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఇంకా మే నెల రానే లేదు. పగటి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నా యి. సోమవారం ఖానాపూర్‌లో పగటి పూట ఉష్ణోగ్రతలు 43.07 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఎండ వేడిమి భరించలేక జనాలు బెంబేలెత్తు తున్నారు. ప్రధాన మార్కె ట్లు కొనుగోలుదారులు రాక బోసిపోయి కనిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులు మధ్యాహ్నం రెండు మూడు గంటల పాటు తమ దుకాణాలను మూసి ఉంచుతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి తెరుస్తున్నారు. ప్రజలు కూడా తమ నివాస గృహాలు విడిచి సాయంత్రమే బయటకు వచ్చి తమ పనులు చేసుకుంటున్నారు. తప్పని సరై వివిధ పనుల నిమిత్తం పల్లెల నుంచి ఖానాపూర్‌కు వచ్చేవారు శీతల పానీయాలు సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...