ఉత్సాహంగా కుస్తీ పోటీలు


Tue,April 16, 2019 01:29 AM

భైంసారూరల్ : మండలంలోని కామోల్ గ్రామంలో జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా సోమవారం ఆలయ కమిటీ, వీడీసీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో భైంసా, కుభీర్, ముథోల్ మండలాలలో పాటు మహారాష్ట్రలోని భోకర్, నాందేడ్, లాతూర్, నాసిక్ తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా వీడీసీ సభ్యులు మల్లయోధులను ఊరేగింపుగా మైదానంలోకి తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. మొదటి బహుమతిగా ఐదు తులాల వెండి కడియంతో పాటు రూ. 5011 నగదును అందించారు. మహారాష్ట్రకు చెందిన గణేశ్ అనే మల్లయోధుడు ఒంటి చేత్తో కుస్తీపట్టి అజేయంగా నిలిచాడు. ఒక్కొ క్కరినీ మట్టికరిపిస్తుంటే ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గణేశ్ పట్టుదల, సాధన ముందు వైకల్యం ఓడిపోయిందని పలువురు అభినందించారు. పోటీల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భైంసా రూరల్ ఎస్సై పున్నంచందర్ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ముత్తవ్వ, నాయకులు దేవేందర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో భండార్ కార్యక్రమం నిర్వహించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...