అటవీ సంపదను కాపాడడానికి చర్యలేవి..!


Mon,April 15, 2019 02:12 AM

సిరికొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడవులను పెంచాలనే ఉద్దేశంతో హరితహారం వంటి కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. వీటి కోసం కోట్లాది రూపాయలను సైతం ఖర్చు చేసి అడవులను సంక్షర కోసం కృషి చేస్తుంటే మరోపక్క విలువైన టేకు మొక్కలు ఇతర చెట్లు నిప్పు రవ్వతో అగ్గిపాలు అవుతున్నాయి. మండలంలో ఉన్న పచ్చని అడవి కళ్లముందే కాలి బూడిద అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మండలంలోని జండాగూడ, వాయిపేట్, తుమ్మలపాడ్, లచ్చింపూర్, సిరికొండ, అడవుల్లో మొక్కలు అగ్గికి కాలి బూడిద అవుతున్నాయి. మండలంలోని కొంత మంది రైతులు పొలం గట్లు పై పెంచుకుంటున్న హరితహారం మొక్కలు సైతం కాలి బూడిద అవుతున్నాయి. వేసవితో అడవిని రక్షించాలని అధికారులు చెబుతున్నప్పటికీ అవి ఎక్కడా అమలు అవడం లేదని విమర్శలు వ్యక్తమతున్నాయి. అడవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా అడవిని సంక్షించడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా ఉన్నాతాధికారులు దృష్టి సారించి వేసవికాలంలో అటవీ ప్రాంతాలు అగ్నికి ఆహుతి కాకుండా చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...