టీఆర్‌ఎస్ పార్టీదే గెలుపు


Mon,April 15, 2019 02:12 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ స్థానం గెలుపు టీఆర్‌ఎ స్ పార్టీదేనని, తామంతా మెజార్టీ కోసం కృషి చేశామని ఆదిలాబాద్ ఎ మ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ప్రభుత్వం చేసి న కృషి, సీఎం కేసీఆర్‌పై ఉన్న విశ్వాసంతో ప్రజలు గతేడాది జరిగిన అసెం బ్లీ ఎన్నికల్లో 2/3 మెజార్టీ ఇచ్చి కేసీఆర్‌ను మరోసారి ప్రజలు సీఎం చేశారని గుర్తుచేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 14.83లక్షల మంది ఓటర్లు ఉండ గా 10. 66లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా వివిధ సంక్షేమ పథకాలు పొందుతున్న 3.90లక్షల లబ్ధిదారులకు వెయ్యి73లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడంతోనే ప్రజలు తమకు ఓటువేశారని గుర్తు చే శారు.

కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశారని, వారికి ప్రజలు ఎలా ఓటు వేస్తారని అనుకుంటున్నారని రామన్న విమర్శించారు. దేశ ప్రజలు మార్పును కోరుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. దేశానికి కేసీఆర్ లాంటి నాయకత్వం అవసర ముందని ఫెడరల్ ఫ్రంట్‌ను ఏ ర్పాటు చేసి రాజకీయాలను శాసిస్తారన్నారు. బీజేపీ నాయకులు కిరాయి మనుషులతో జై శ్రీరాం, సబ్‌కాసాత్ సబ్‌కా వికాస్ నినాదం తెచ్చారని వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు గెలుస్తున్నాయని కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతునదన్నారు. స మావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, ఐసీడీఎస్ కార్యనిర్వహకురాలు కస్తాల ప్రేమల, టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్లు దారవేణి సత్యనారాయణ, వేణ/గంటి ప్రకాశ్, కలాల శ్రీనివాస్, సయ్యద్ సాజిదొద్దీన్, సుఖేందర్, జనగం సంతో శ్, సంజయ్ పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...