ఉపాధికి ఊతం..!


Mon,March 25, 2019 01:42 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 5,57,249 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉండగా.. వీటిలో 11,66,305మంది కూలీలు నమోదై ఉన్నారు. ఈ ఏడాది 2,97,169జాబ్ కార్డుల్లోని 5,29,394మంది కూలీలకు ఉపాధి పనులు క ల్పించారు. ఉపాధి పనుల కల్పనలో ఉమ్మడి జిల్లాలోనే నిర్మల్ జిల్లా అగ్ర స్థానంలో నిలువగా.. రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో నిలిచింది. ఉపాధి పనుల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా కూలీలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫాం పాండ్స్, అడవుల్లో ట్రెంచ్‌లు, భూముల అభివృద్ధి, ఊట చెరువుల తవ్వకం, చేపల పాండ్స్, పశువుల, గొర్రెల షెడ్లు, నాడెపు కాంపౌండ్స్ పిట్స్ నిర్మాణం చేశారు. ఒక్కో కూలీకి సగటున రోజుకు రూ.205చొప్పున అత్యధికంగా చెల్లిస్తుండగా.. అత్యల్పంగా రూ.50 తగ్గకుండా చెల్లిస్తున్నారు. ఎండాకాలం కావడంతో ఎండ వేడిమి పెరగడంతో.. ఉపాధి వేతనం పెంచా రు. ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30శాతం, జూన్ నెలలో 20 శాతం అదనంగా కూలీ డబ్బులు చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వేసవిలో ఉపాధి కూలీల సంఖ్య తగ్గకుండా, కూలీలకు మరింత గిట్టుబాటు అయ్యేందుకు అవకాశముంది.

ఆదిలాబాద్ జిల్లాలో 1,57,162 జాబ్ కార్డులు జారీ చేయగా.. ఇందులో 3,30,193మంది కూలీలు ఉన్నారు. ఈ ఏడాది 3577కొత్త జాబ్ కార్డులను 7536 మందికి జారీ చేశారు. ఈ సారి 72818 జాబ్ కార్డుల్లోని 1,37,241మందికి ఉపాధి పనులు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరం లో జిల్లాలో మొత్తం రూ.87.10కోట్ల నిధులు ఖ ర్చు చేశారు. రూ.59.66 కోట్లను ఉపాధి కూలీలకు చెల్లించగా.. 76.71శాతంగా ఉంది. రూ.18.11కోట్లతో మెటీరియల్ పనులు చేయించగా.. 23.29 శాతంగా ఉంది. రూ.9.32కోట్లను నిర్వహణ ఖర్చులుగా ఉండగా.. 11.99శాతంగా ఉంది. ఈ ఏడాది 41.92లక్షల పనిదినాలు క ల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 35,03,412 పని దినాలు కల్పించి 83.58శాతం లక్ష్యం చేరారు. ఒక్కో కుటుంబానికి సగటున 48.11రోజుల పని చూపగా.. రోజుకు సగటున రూ.165.88చొప్పున చెల్లించారు. ఇక 5,991కుటుంబాలకు 100రోజుల పాటు ఉపాధి కల్పించారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,18,548జాబ్ కార్డులు జారీ చేయగా.. ఇందులో 2,55,975 మంది కూలీలున్నారు. ఈ ఏడాది 1,380కొత్త జా బ్ కార్డులను 3,297మందికి జారీ చేశారు. ఈ ఏడాది 66604జాబ్ కార్డుల్లోని 1,23,458 మందికి ఉపాధి పనులు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 67.57కోట్ల నిధులు ఖర్చు చే శారు. ఇందులో రూ.52.44కోట్లను ఉపాధి కూలీలకు చెల్లించగా.. 85.55శాతంగా ఉంది. మెటీరియల్ పనులను రూ.8.86 కోట్లతో మెటీరియల్ పనులు చేయించగా.. 14.45శాతంగా ఉంది. మరో రూ.6.27కోట్లను నిర్వహణ ఖర్చులకు వినియోగం చేయగా.. 10.23శాతంగా ఉంది. ఈ ఏడాది 42.26లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 32,20,941పని దినాలు కల్పించి 76.21శాతం లక్ష్యం చేరారు. ఒక్కో కుటుంబానికి సగటున 48.36రోజుల పని చూపగా.. రోజుకు సగటున రూ.162.55 చొప్పున చెల్లించారు. ఇక 5297కుటుంబాలకు 100రోజుల పాటు ఉపాధి కల్పించారు.

మంచిర్యాల జిల్లాలో 1,26,976జాబ్ కార్డులు జారీ చేయగా.. ఇందులో 2,57,381మంది కూలీలున్నారు. ఈ ఏడాది 2,375కొత్త జాబ్ కార్డులను 5,711మందికి జారీ చేశారు. ఈ ఏడాది 65,368 జాబ్ కార్డుల్లోని 1,09,813మందికి ఉపాధి పనులు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 66.52కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో రూ.45.85కోట్లను ఉపాధి కూలీలకు చెల్లించగా.. 77.64శాతంగా ఉంది. మెటీరియల్ పనులను రూ.13.20కోట్లతో మెటీరియల్ పనులు చేయించగా.. 22.36శాతంగా ఉంది. మరో రూ.7.47కోట్లను నిర్వహణ ఖర్చులకు వినియోగం చేయగా.. 12.66శాతంగా ఉంది. ఈ ఏడాది 47.09లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2,95,2273 పని దినాలు కల్పించి 72.7శాతం లక్ష్యం చేరారు. ఒక్కో కుటుంబానికి సగటున 45.16రోజుల పని చూపగా.. రోజుకు సగటున రూ.157.74చొప్పున చెల్లించారు. 4,805కుటుంబాలకు 100రోజుల పాటు ఉపాధి కల్పించారు.

నిర్మల్ జిల్లాలో 1,59,608జాబ్ కార్డులు జారీ చేయగా.. ఇందులో 3,22,805మంది కూలీలున్నారు. ఈ ఏడాది 6540కొత్త జాబ్ కార్డులను 13,688మందికి జారీ చేశారు. ఈ ఏడాది 92,379జాబ్ కార్డుల్లోని 1,58,882మందికి ఉపాధి పనులు కల్పించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 105.28కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో రూ.77.72కోట్లను ఉపాధి కూలీలకు చెల్లించగా.. 79.79శాతంగా ఉంది. మెటీరియల్ పనులను రూ.19.69కోట్లతో మెటీరియల్ పనులు చేయించగా.. 20.21శాతంగా ఉంది. మరో రూ.7.87కోట్లను నిర్వహణ ఖర్చులకు వినియోగం చేయగా.. 8.09 శాతంగా ఉంది. ఈ ఏడాది 54.31లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 49,85,7673 పని దినాలు కల్పించి 91.81శాతం లక్ష్యం చేరారు. ఒక్కో కుటుంబానికి సగటున 53.97రోజుల పని చూపగా.. రోజుకు సగటున రూ.159.39 చొప్పు న చెల్లించారు. 9,825కుటుంబాలకు 100రోజుల పాటు ఉపాధి కల్పించారు.

బాధితులకు అండగా సీఎంఆర్‌ఎఫ్
నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ: ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. అరుదైన వ్యాధికి కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకుంటున్న పేదలకు ఆర్థిక సాయం అందజేస్తున్నది. సమైక్య పాలనలో పేదలు వైద్యానికి డబ్బు చెల్లించలేక అప్పులు తీసుకువచ్చి వాటిని చెల్లించే పరిస్థితులు లేక ఎందరో మంది ప్రాణాలు వదులుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందుతున్న ఆర్థిక సాయం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. లక్షల రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకోలేని వారిని అన్నివిధాలా ఆదుకుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారితోపాటు ముందస్తు వైద్య చికిత్స కోసం ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందజేస్తూ ప్రాణాలను కాపాడుతున్నది.

నిర్మల్ నియోజక వర్గంలో 1527 మందికి సాయం
నిర్మల్ నియోజక వర్గంలోని దిలావర్‌పూర్, నర్సాపూర్, సారంగపూర్, లక్ష్మణచాంద, సోన్, నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, మామడ మండలాల్లో ఇప్పటి వరకు వివిధ రోగాలతో బాధపడుతున్న 1527 మందికి వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు 280ఎన్‌వోసీ చెక్కులను అందజేశారు. ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయంతో వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకుని పేదలు సంతోషంగా జీవిస్తున్నారు. తమకు మరో జన్మను ప్రసాదించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...