సదర్‌మాట్‌కు మహర్దశ


Mon,March 25, 2019 01:42 AM

ఖానాపూర్: సమైక్య రాష్ట్రంలో పాలకులు వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక సాగునీటి వనరు సదర్‌మాట్ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.చాలా చోట్లా మట్టి కాలువ గట్లు కూలిపోతే రైతులే స్వయంగా మరమ్మతు చేసుకొని పంటలు పండించుకునే దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆ పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ సాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ఖానాపూర్, కడెం రెండు మండలాలకు సాగు నీరందించే సదర్‌మాట్ ప్రధాన కాలువలు ఉపయోగంలోకి వచ్చాయి. ఈ ప్రధాన కాలువ అభివృద్ధికి, లైనింగ్ పనులు, తూముల మరమ్మతు, మాట్ రిపేర్, పలు చోట్లా కాలువపై ఎడ్లబండ్ల వంతెనల నిర్మాణం ఇలా అనేక రకాల పనులు నిర్వహించారు. సదర్‌మాట్ కాలువ ద్వారా సమైక్యపాలనలో ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. కానీ మట్టి కట్టల కాలువ, ప్రతీ వర్షాకాలంలో గండ్లు పడడం ఇలాంటి ఎన్నో సమస్యల కారణంగా ఏడాదికి కనీసం 5వేల ఎకరాల్లో పంట పండేది కాదు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ. 20 కోట్ల మేరకు నిధులు మంజూరు చేయడంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు నుంచి 22 కిలో మీటర్ల పొడవు వరకు ప్రధాన కాలువ అభివృద్ధి పనులు చేపట్టారు. మరో రూ. 3 కోట్లతో బాదనకుర్తి కెనాల్‌కు కూడా లైనింగ్ చేయించారు. ఎగువ ప్రాంతాన ఉన్న సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే సదర్‌మాట్ రైతులకు కోరుకున్నన్ని సాగునీరు విడుదల చేసుకునే అవకాశం ఏర్పడనుంది. కాలువ లైనింగ్ పనులు జరుగడంతో ప్రతీ నీటి బొట్టు పంటపొలాలకే చేరుతుంది. భవిష్యత్తులో సదర్‌మాట్ ప్రధాన కాలవ కింద 15 వేల నుంచి 18 వేల ఆయకట్టు పెరుగవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...