మెజార్టీయే లక్ష్యం


Sun,March 24, 2019 12:01 AM

- ఎంపీ అభ్యర్థి నగేశ్ గెలుపునకు ఐక్యంగా ముందుకు
- ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో భేటీలు
- మండల స్థాయిలో కార్యకర్తలతో సమీక్షలు
- ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం గెలుపుపై మంత్రి అల్లోల దృష్టి

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాన్ని పదిలంగా ఉంచుకునేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ ముఖ్య నాయకులు కార్యాచరణ అమలు చేస్తున్నారు. లోక్‌సభ స్థానం ఇన్‌చార్జి, రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భారీ మెజార్టీయే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందుకోసం నాయకులందరినీ ఐక్యంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మండలాల వారీగా ముఖ్య కార్యకర్తలతోనూ సమావేశమవుతున్నారు. తాజాగా శనివారం ఇచ్చోడలోని ఎంపీ నగేశ్ ఇంట్లో మంత్రి అల్లోల.. ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశమయ్యారు. పార్లమెంటరీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాన్ని పదిలంగా ఉంచుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. సిట్టింగ్ ఎంపీ గొడం నగేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు అవసరమైన కార్యాచరణ అమలు చేస్తున్నారు. లోక్‌సభ స్థానం ఇన్‌చార్జి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఈ లోక్‌సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించేలా ప్రత్యేక దృష్టి సారించారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నగేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు నాయకులందరినీ ఐక్యంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే మంత్రి అల్లోల నేతృత్వంలో లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్యేలతో కూడా సమావేశమయ్యారు. తాజాగా మండలాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రోజు నాలుగైదు మండలాలు పర్యటించి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఖానాపూర్, కడెం, జన్నారం మండలాల్లో పర్యటించి కార్యకర్తలతో పార్లమెంట్ ఎన్నికలపై సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీ నగేశ్‌తో కలిసి పలు సమావేశాల్లో పాల్గొన్నారు. బోథ్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులతో రెండుచోట్ల బోథ్ నియోజకవర్గ పార్లమెంటరీ సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఇచ్చోడలోని ఎంపీ నగేశ్ ఇంట్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నగేశ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, టీఎస్ డీడీసీ ఛైర్మన్ లోక భూమారెడ్డితో సమావేశమయ్యారు. పార్లమెంటరీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. ఆయా నియోజకవర్గాల వారీగా సమీక్ష చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందరిని కలుపుకొని వెళ్లాలని సూచించారు. నగేశ్ విజయానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. ఎంపీ అభ్యర్థి నగేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...