ఈదురుగాలుల బీభత్సం


Sat,March 23, 2019 12:02 AM

పెంబి: పెంబి మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు వీచాయి. మందపెల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుంచు గంగన్న అనే వ్యక్తి ఇంటిపై చెట్టుకూలింది. కొందరి గ్రామస్తుల ఇండ్లపై ఉన్న పైకప్పులు కొట్టుకొని పోయాయి. మందపెల్లి-పెంబి ప్రధాన రహదారిపై భీమన్న ఆలయం వద్ద రోడ్డుపై ఈదురుగాలుల తీవ్రతకు చెట్టు కూలిపోవడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో మందపెల్లి, పెంబి తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడి తోటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో పాటుగా వడగండ్లవాన కురవడంతో నువ్వు పంటకు కూడా నష్టం వాటిల్లింది. ఆరుబయట ఎండబెట్టిన పసుపు వర్షానికి తడిసిపోయింది. తమని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

కడెం మండలంలో..
కడెం : మండలంలో రెండు రోజుల క్రితం కురిసిన గాలివాన బీభత్సానికి పంట నష్టం జరిగింది.పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరగగా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బెల్లాల్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు స్తంభాలు నేలకొరిగాయి. శుక్రవారం ట్రాన్స్‌కో అధికారులు అయా గ్రామాలను సందర్శించారు. పంటపొలాల కోసం వేసిన నూతన విద్యుత్ స్తంభాలు విరిగినట్లు తెలిపారు. వేసవి పంటలకు తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, విరిగిన చోట కొత్త స్తంభాలు ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాచేయాలని రైతులు కోరుతున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...