ఐదో రోజు 4 నామినేషన్లు


Sat,March 23, 2019 12:02 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఐదోరోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ తరఫున సోయం బాపురావు రెండు సెట్ల నామినేషన్లు, కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ తరపున ఆ పార్టీ నాయకుడు సాడిగే రాజేశ్వర్, రాథోడ్ రమేష్ కుమారుడు రితీశ్ రాథోడ్ ఒక్కో సెట్ నామినేషన్ వేశారు. నవ ప్రజా రాజ్యం పార్టీ తరఫున కుమ్ర వందన నామినేషన్ వేశారు. మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రారంభమైన మొదటి రోజు కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రెండు, మూడు రోజుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నేడు, రేపు సెలవు కావడంతో సోమవారం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌లు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...