ఓటు హక్కును వినియోగించుకున్న పట్టభద్రులు


Sat,March 23, 2019 12:02 AM

నిర్మల్‌టౌన్/సోన్/దిలావర్‌పూర్/ లక్ష్మణచాంద: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్ర వారం నిర్వహించిన పోలింగ్‌లో పలువురు పట్టభద్రులు, ఉపాధ్యాయులు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్ పట్టణంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు వేశారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జడ్పీ చైర్‌పర్సన్ శోభారాణితోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్రకార్యదర్శి సత్యనారాయణ్‌గౌడ్, టీఆర్‌ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీహరిరావు, అధికారులు తదితరులు ఓటు హక్కును వినిగించుకున్నారు. నిర్మల్ ఎంపీడీవో కార్యాలయంలో జేసీ బాస్కర్‌రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల నియోజక వర్గానికి ఆయన ఓటు వేశారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌కేంద్రాలను జేసీ పరిశీలించి సిబ్బంది సూచనలు, సలహాలను అందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఎస్టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గజేందర్, పీఆర్టీయూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రబాబు , టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళిమనోహర్, డీటీపీఎప్ జిల్లా అధ్యక్షుదు మధుసూదన్‌రావు, టీటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌తో పాటు గజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ముత్యంరెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్‌తోపాటు తహసీల్దార్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...