చెట్టుకు ఢీ కొన్న పెళ్లి వాహనం


Sat,March 23, 2019 12:01 AM

భీంపూర్: మండలానికి చెందిన గొల్లగడ్ నుంచి మహారాష్ట్ర గాటంజీ తాలూకా మంగి వైపు పెళ్లి సామగ్రి, బంధువులతో వెళ్తున్న మ్యాక్స్ ఒక చెట్టుకు ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరా లు ఇలా ఉన్నాయి. ఎంహెచ్ మంగిలో జరిగే పెళ్లికోసం బం ధువులు శుక్రవారం మ్యాక్స్‌లో కూలర్ , ఇతర సామగ్రి వేసుకుని వెళ్తున్నారు. మహారాష్ట్రలోని గన్నేరా దాటిన తరువాత అడవిమార్గ రోడ్డుపై అదుపుత ప్పి చెట్టును ఢీ కొం ది. దీంతో మ్యాక్స్ వాహనం ధ్వంస మయ్యింది. అందు లో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, మునేశ్, మ్యాకల్‌వార్ మనోహర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని మహారాష్ట్ర యవత్‌మాల్ దవాఖానకు తరలించారు. మనోహర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు వెల్లడించారు గాటంజీ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...