విద్యుత్ షాక్‌తో పశువులు మృతి


Fri,March 22, 2019 02:47 AM

ముథోల్ : మండలంలోని కారేగాం గ్రామ శివారులో గురువారం విద్యుత్ వైర్లు తగిలి 10 గేదెలు, మూడు ఆవులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బాధిత రైతులు తెలిపిర వివరాల ప్రకారం బుధవారం రాత్రి బలంగా వీచిన ఈదురుగాలులకు కారేగాం శివారులోని విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వీటిని గమనించని రైతులు గురువారం మధ్యాహ్నం పశువులను సేద తీర్చడానికి చెట్టు దగ్గరికి తీసుకెళ్తుండగా.. ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్లిన 13 పశువులు షాక్ తగిలి మృతి చెందడంతో పశువుల కాపరి గమనించి మరిన్ని గేదెలను పక్కకు తోలడంతో భారీ ప్రమాదం తప్పింది. మృతి చెందిన ఒక గేదె సుమారు రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు ఉంటుందని బాధిత రైతులు అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే తమకు నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సంఘటన స్థలాన్ని పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ శంకర్ పరిశీలించారు.

నష్టపరిహారానికి సంబంధించిన విషయంపై ఉన్నతాధికారులకు నివేదించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతి చెందిన బర్రెలతో దాదాపు రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. తెగి ఉన్న విద్యుత్ వైర్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్తులకు విన్నవించారు. అధికారులు వైర్లను త్వరలోనే సరిచేయిస్తామని హామీ ఇచ్చారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...