మండలి ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు


Fri,March 22, 2019 02:47 AM

నిర్మల్‌టౌన్: శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎం.ప్రశాంతి తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై గురువారం ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. నిర్మల్ డివిజన్‌లోని 19 పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన సిబ్బంది వాహనాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మల్ డివిజన్‌లో మొత్తం 19 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇందులో 13 కామన్ పోలింగ్ కేంద్రాలున్నాయని, పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు ఐదు కాగా ఒక ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రం ఉందని అన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో పీవో, అసిస్టెంట్ పీవో, మరో ఐదుగురు సిబ్బందిని నియమించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫి ఉంటుందని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేదుకు ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఆర్డీ వో ప్రసూనాంబ, తహసీల్దార్లు అనుపమరావు, అతికొద్దీన్, యా దవ్, శివప్రసాద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...