పండుగలతో ఐక్యత


Fri,March 22, 2019 02:46 AM

నిర్మల్‌అర్బన్, నమస్తే తెలంగాణ/ నిర్మల్‌టౌన్: పండుగలతో ఐక్యత వస్తుందని, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యమని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన హోలీ సంబురాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఉద్యోగులు కలెక్టర్‌కు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ శశిధర్‌రాజు, ఏఎస్పీ దక్షిణమూర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహజసిద్ధ రంగులతో హోలీ సంబురాలు నిర్వహించుకోవాలన్నారు. చిన్నాపెద్ద బేధం లేకుండాఅందరూ పాల్గొనే హోలీ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అనంతరం ఉద్యోగులకు, సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో అధికారులతో పాటు క్యాంపు కార్యా ల ఉద్యోగులు ముత్యం, సందీప్, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.

రంగుల్లో మునిగితేలిన బీఎస్‌ఎఫ్ బలగాలు
ఎన్నికల విధుల నిమిత్తం జిల్లాకు చేరుకున్న బీఎస్‌ఎఫ్ బలగాలు సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామంలో గల మహిళా ప్రాంగణంలో హోలీ సంబురాల్లో మునిగితేలారు. బీఎస్‌ఎఫ్ బలగాలకు మహిళా ప్రాంగణంలో క్యాంపు ఏర్పాటు చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ శశిధర్‌రాజు, ఏఎస్పీ దక్షిణమూర్తి బీఎస్‌ఎఫ్ బలగాల క్యాంపునకు చేరుకుని హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సుమారు రెండుగల పాటు వారితో ఉత్సాహంగా ఆడిపాడారు. ఎస్పీ స్వయంగా వచ్చి తమతో హోలీవేడుకల్లో పాల్గొనడంతో బీఎస్‌ఎఫ్ బలగాల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదా య శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని నివాసంలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అన్ని వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే హోలీ పండుగ విశిష్టమైనదని, హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...