రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలు


Fri,March 22, 2019 02:46 AM

బజార్‌హత్నూర్ : అనాధిగా వస్తున్న సంప్రాదాయలకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయి బజార్‌హత్నూర్ కుస్తీ పోటీలు. వీటికి రానున్న రోజుల్లో మరింత ప్రోత్సాహం అందించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సర్పంచ్ పరాచ లావణ్య అన్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ముందుగా మల్లయోధులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో కనుమరుగవుతున్న ఆటలను గ్రామ ప్రజలు గుర్తుంచుకోని పెద్ద ఎత్తున నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో మల్లయోధులే కాకుండా మహారాష్ట్రలోని కిన్వట్, నాసిక్, నాందేడ్, నాగ్‌పూర్, హర్యాన నుంచి అధిక సంఖ్యలో మల్లయోధులు వచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ గ్రామపెద్దలు మల్లయోధులకు ఇబ్బందులు కలుగకుండా పోటీలను నిర్వహించారు. కుస్తీ పోటీలు పలువురిని ఎంతోగానో ఆకట్టుకున్నాయి. న్యాయ నిర్ణేతలుగా గ్రామపెద్దలు వ్యవహరించి గెలుపొందిన మల్లయోధులకు సర్పంచ్ నగదు బహుమతులను అందజేశారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...