కామదహనంలో ఆదివాసీల ప్రత్యేకత


Fri,March 22, 2019 02:46 AM

దస్తురాబాద్ : మండలంలోని గొడిసేర్యాల గొండు గూడ (జీ) గ్రామ పంచాయ తీలో బుధవారం రాత్రి ఆదివాసీలు ఘనంగా కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివాసి గూడెల్లో హోలి పండుగకు ప్రత్యేకత ఉంది. కామదహనంలో మాతరి, మాత్రల్ (ముసలవ్వ,ముసలయ్య) పేరుతో రెండు పొడవాటి వెదురు కర్రలను తీసుకొని వాటికి కొన భాగంలో వాలుగా చతురస్రాకారంలో సన్నని పట్టీలకు కుడక, ఉల్లిగడ్డలు, గారెలు, వంకాయలను వేలాడదీస్తారు. అనంతరం పొడవాటి కర్రలకు కింది భాగంలో నిప్పు (కామదహనం) చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో మాతరి ముసలవ్వ, మాత్రల్ ముసలయ్య గా అభివర్ణిస్తారు. కామ దహనంలో ఏది ముందుగా పడిపోతుందో ఆ సంవత్సరం వారిదీ అదృష్ట సంవత్సరంగా భావిస్తారు. నూతన దంపతులు, తల్లిదండ్రుల నుంచి వేరు పడిన కొడుకు-కోడళ్లు కుడక ను అందజేస్తారు. దీంతో గ్రామంలోని కుటుంబాల్లో మరో కుటుంబం పెరిగిందని లెక్కిస్తామని, మరుసటి రోజు హోలీ గ్రామంలో ఎన్ని గడపలు ఉన్నాయో ఆ గడపలకు కామదహన బూడిదను గుమ్మానికి ఎదురుగా పోస్తమని ఆదివాసీలు తెలిపారు. బూడిద పోస్తే క్రిమికీటకాలు రావని తెలిపారు.

19
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...