అభివృద్ధిని చూసి ఓటేయండి


Thu,March 21, 2019 12:27 AM

నేరడిగొండ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. బుధవారం మండలంలోని యాపల్‌గూడ, లఖంపూర్, రోల్‌మామడ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధికి నోచుకోక పోగా, ఇక్కడి ప్రజలను విస్మరించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రోడ్లు, తాగునీరు, 24 గంటల విద్యుత్, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా, ఆసరా పింఛన్లు, నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, మిషన్‌భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లానీరు వంటి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే సంక్షేమ, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓటువేసి గెలిపించారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ ఖాళీ అయిపోతుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు సయ్యద్ జహీర్, గాదెశంకర్, ఆడెపు రమేశ్, మహేందర్‌రెడ్డి, కపిల్, ఉప్పు పోశెట్టి, కోటేశ్వర్, రాజు, కృష్ణ, భీంరావు, లఖంపూర్ సర్పంచ్ జంగు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలే ఎంపీని గెలిపిస్తాయి
ఇంద్రవెల్లి : పూటకో పార్టీ మారుస్తున్న రాజకీయ నాయకులను ప్రజలు నమ్మడం లేదని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. బుధవారం మండలంలోని దోడంద, ఘట్టేపల్లి గ్రామాల్లో లక్కేరావ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీను ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు భవిష్యత్ లేకుండా చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవ్‌పూజె మారుతి, కోరెంగా సుంకట్‌రావ్, ఎంపీటీసీలు కనక హనుమంత్‌రావ్, కోవ రాజేశ్వర్, సర్పంచులు నాగోరావ్, మోహన్‌రావ్ పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...