రంగుపడుద్ది..


Thu,March 21, 2019 12:27 AM

- నేడు హోలీ
భైంసా, నమస్తే తెలంగాణ : ప్రకృతి అందాలు ఆవిష్కృతం చేసే రంగుల సంబురం హోలీ. చిన్నాపెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాల మధ్య నిర్వహించే రంగుల సంబురానికి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బుధవారం రాత్రి కాముని దహనం నిర్వహించారు. సహజ సిద్ధ రంగులు, పిల్లలు ఉపయోగించే స్ప్రేయర్ల విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు బుధవారం హోలీ పండుగ నిర్వహించగా, గురువారం మిగతా ప్రాంతాల్లో సంబురాలు నిర్వహించనున్నారు.

భిన్న సంస్కృతీసంప్రదాయాలకు నిలయమైన జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటనున్నాయి. ప్రజలంతా ఒక్కటిగా నిర్వహించుకునే పండుగలలో ఒకటైన హోలీ వేడుకలు రెండు రోజులుగా అంబరాన్నంటుతున్నాయి. బుధవారం రాత్రి కాముని దహనం నిర్వహించిన ప్రజలు గురువారం హోలీ సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మార్కెట్‌లో సహజ సిద్ధ రంగులతో పాటు పిల్లలు ఉపయోగించే రంగుల స్ప్రేయర్ల్ల విక్రయాలు జోరందుకున్నాయి. హోలీ సంబురాల్లో రంగులతో పాటు స్వీట్లకూ ప్రత్యేక స్థానం ఉండడంతో వ్యాపారులు రకరకాల స్వీట్లు అందుబాటులో ఉంచారు. హోటళ్లు, ఫాం హౌజ్‌లు తదితర ప్రదేశాల్లో ఈవెంట్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
సహజ సిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలి. రసాయనాలతో తయారు చేసిన రంగులను వాడొద్దు. కళ్లలో రంగుపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు కళ్లద్దాలు ఉపయోగించాలి. రంగులు కళ్లలో పడితే వెంటనే శుభ్రమైన నీటితో కడగాలి. మంటగా అనిపిస్తే దగ్గరలోని డాక్టరును సంప్రదించాలి.
- డాక్టర్ కాశీనాథ్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్, భైంసా

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...