కన్నెమ్మ చెరువులో మొసలి


Thu,March 21, 2019 12:26 AM

లక్ష్మణచాంద: మండలంలోని పార్‌పెల్లి గ్రామ కన్నెమ్మ చెరువులో మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న చెరువులోకి కుక్క దిగుతుండగా సరదాగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ క్రమంలో చెరువుల నుంచి వచ్చిన మొసలి కుక్కను నోట కరుచుకుని వెళ్లిన దృశ్యం రికార్డయ్యింది. మంగళవారం రాత్రి ఓ గొర్రెల కాపరి నీటి కోసం గొర్రెలను చెరువుకు తీసుకెళ్లగా ఓ గొర్రెను మొసలి లాక్కెల్లింది. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెరువు వైపు వెళ్లడానికి గ్రామస్తులు జంకుతున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ రాజేందర్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో బుధవారం సాయంత్రం మామడ ఎఫ్‌ఆర్‌వో ప్రణీత్‌కౌర్ చెరువును పరిశీలించి మొసలిని పట్టుకుంటామని గ్రామస్తులతో అన్నారు. కన్నెమ్మ చెరువుతో పాటు పోచమ్మ కుంటలో కూడా మొసలి సంచరిస్తున్నదని గ్రామస్తులు అంటున్నారు. రెండు చెరువుల్లోని మొసళ్లను మొసల్లను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పశువుల కాపరులు భయపడుతున్నారు

కాపరులు నీటి కోసం పశువులను చెరువుకు తీసుకెళ్తారు. మొసలి కనిపించడంతో ప్రస్తుతం అటువైపు వెళ్లేందుకు భయపడుతున్నారు. పశువుల కాపరులు, రైతులు అటువైపు వెళ్లడం లేదు. అటవీశాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకుంటే గ్రామస్తుల భయం పోతుంది. పోచమ్మ కుంటలో కూడా మొసలి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- రాజేందర్, సర్పంచ్, పార్‌పెల్లి

భయంగా ఉంది
చేపల వేటకు వెళ్లాలంటే భయంగా ఉంది. వెంటనే అధికారులు మొసలిని పట్టుకుంటే బాగుంటుంది. మేకను, కుక్కను పట్టుకొని తిన్నది. చేపల వేట బంద్ చేసినం. గ్రామానికి ఆనుకొని ఉన్న రెండు చెరువుల్లో మొసళ్లు ఉన్నాయని పుకార్లు ఉన్నాయి. ప్రాణ నష్టం జరగకముందే అధికారులు స్పందించి మొసళ్లను పట్టుకోవాలి. అప్పుడే గ్రామస్తుల్లోని భయం పోతుంది.
- వినోద్, జాలరి, పార్‌పెల్లి

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...