చట్టాలపై అవగాహన ఉండాలి


Wed,March 20, 2019 02:16 AM

నేరడిగొండ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బోథ్ సివిల్ కోర్టు జడ్జి కిరణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని తేజాపూర్ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో భూ తగాదాలు వంటివి కూడా కేసుల వరకు వస్తున్నాయని అలాంటి వాటిని గ్రామాల్లోని పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలన్నారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండేలా చూడాలని జరిగితే చట్టరీత్యా నేరం అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయరాదన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను తప్పకుండా బడిలో ఉండేలా చూడాలన్నారు. అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగినా అలాంటి వాటిని కోర్టు వరకు వచ్చిన కేసుల్లో రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమాయక రైతులను చూసి కొంతమంది నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే చాలా దట్టమైన అడవులు ఉండేవని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చెట్లు నరకడంతో మైదానాలుగా మారాయన్నారు. చెట్లు నరికినా, కలప స్మగ్లింగ్ చేసినా బాధ్యులపై కఠినమైన చట్టాలను ప్రయోగించి కేసులు చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ఇంటింటికీ మొక్క నాటాలని, ఉన్న చెట్లను కాపాడడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజలకు అన్ని రకాల చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నేరడిగొండ ఎస్సై భరత్ సుమన్, సర్పంచ్ ప్రపూల్‌చందర్‌రెడ్డి, గ్రామస్తులు, సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...