ఢిల్లీని శాసిద్దాం


Wed,March 20, 2019 02:16 AM

ఖానాపూర్/కడెం:సీఎం కేసీఆర్‌పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటి ఢిల్లీని శాసిద్దామని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అధ్యక్షతన మంగళవారం ఖానాపూర్‌లోని మస్కాపూర్ శివారులో ఉన్న ఎల్‌ఆర్ గార్డెన్స్‌లో ఖానాపూర్, పెంబి మండలాల కార్యకర్తలతో, కడెం మండల కేంద్రంలోని రామాలయం సమీపంలో మండల కార్యకర్తలతో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు వేర్వేరుగా నిర్వహించారు. ఎంపీ గొడం నగేశ్, రాష్ట్ర పాడి పరిశ్రమ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి పాల్గొన్న సమావేశాలకు మంత్రి ఐకే రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్త ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పని చేశారని, వారి ఉత్సాహానికి వందనాలు తెలుపుతున్నానని అన్నారు. అదే ఉత్సాహంతో పని చేసి ఏప్రిల్ 11న నిర్వహించనున్న ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని అన్నారు. మే నెలాఖరు వరకు రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు పూర్తవుతాయని, ఎన్నికల తరువాత అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చేసుకుందామని అన్నారు. బంగారు తెలంగాణ కల సాకారంలో వచ్చే నాలుగేండ్లు మైలురాయిగా నిలుస్తాయని అన్నారు.

ఏడాది ఆగితే కోరినన్ని నీళ్లు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు చివరి దశకు వచ్చాయని, రైతులు ఒక్క ఏడాది ఓపిక పడితే శ్రీరాంసాగర్ రివర్స్ పంపింగ్ ద్వారా ఖానాపూర్, కడెం మండలాలకు సరిపడా నీళ్లు వస్తాయని మంత్రి ఐకే రెడ్డి అన్నారు. వేసవిలో నీటిని విడుదల చేయించాలని కొందరు రైతులు మంత్రిని కోరగా, ప్రస్తుతం ఎస్సారెస్పీలో తాగునీటి అవసరాలకు నీరు నిల్వ ఉందని, అయినప్పటికీ నీటి విడుదలపై అధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నీటివిడుదలకు కృషి చేస్తామన్నారు.
రూ.750 కోట్లతో కుప్టి నిర్మాణం
కడెం ప్రాజెక్టు ఎగువభాగాన రూ.750 కోట్ల వ్యయంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రెండు పంటలకు నీరందిస్తామని మంత్రి అన్నారు. తాగు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సదర్మాట్ ఆయకట్టు పొన్కల్ వద్ద పనులు చివరి దశకు చేరుకున్నాయని, దాని ద్వారా ఖానాపూర్ మండలంతో పాటు, కడెం మండలంలోని వేల ఎకరాలకు సాగునీరు అందనుందని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే
సుమారు ఏడు దశాబ్దాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని, వారి హయాంలో రాష్ర్టాలు అభివృద్ధికి నోచుకోలేకపోయాయని మంత్రి ఐకే రెడ్డి అన్నారు. ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, 16 ఎంపీ స్థానాలను సీఎంకు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు.

మంత్రికి ఘన సన్మానం
రాష్ట్ర మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీరించిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని కడెం, దస్తురాబాద్ మండలాల్లోని ఆయా గ్రామా ల సర్పంచులు ఘనంగా సన్మానించారు. కడెం లో నిర్వహించిన సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణగౌడ్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మెలుగూరి రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు తక్కళ్ల సత్యనారాయణ, బూక్యా బాపురావు, కడెం, దస్తురాబాద్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు నల్ల జీవన్‌రెడ్డి, కోల గంగన్న, భుక్యా రాజునాయక్, ముడికే ఐలయ్యయాదవ్, టీఆర్‌ఎస్ వాణిజ్య సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నల చంద్రశేఖర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజేందర్‌నాయక్, పార్టీ కడెం మండల కన్వీనర్ కానూరి సతీ శ్, ఖానాపూర్‌లో ని ర్వహించిన సమావేంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బక్కశెట్టి కిశోర్, రైతు సేవా సంఘం చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు, జడ్పీటీసీ తాళ్లపెళ్లి సునీత, మార్కెట్ కమిటీ చైర్మన్ సక్కారాం శ్రీనివాస్, మాజీ చైర్మన్ కల్వకుంట్ల నారాయణ, మాజీ జడ్పీటీసీ రాథోడ్ రామూనాయక్, కడెం మాజీ ఎంపీపీ మొలుగూరి రాజేశ్వర్‌గౌడ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకం రాజేందర్, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ కేహెచ్‌ఖాన్, రైతు సంఘం మండల కో ఆర్డినేటర్ పుప్పాల గజేందర్, పార్టీ పెంబి మండల అధ్యక్షుడు పుప్పాల గజేందర్, ఆత్మ చైర్మన్ రాజారెడ్డి, సర్పంచులు, ఎంపీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...