నర్సింగ్ హోమ్‌లపై ఆదాయపన్ను శాఖదాడులు


Wed,March 20, 2019 02:15 AM

భైంసా, నమస్తే తెలంగాణ : పట్టణంలోని రెండు ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం దాడు లు నిర్వహించారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌కు చెందిన ఐటీ అధికారులు దాడు ల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి సాయం త్రం వరకు దాడులు జరిగాయి. వైద్యులు ఉండే గదులకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్లలో దవాఖానకు వచ్చే ఓపీ వివరాలను సేకరించారు. ఇన్ పేషంట్ వివరాలు, ఆరోగ్యశ్రీ కేసుల నమోదు తదితర అంశాలను పరిశీలించారు. దాదాపు పదేళ్ల క్రితం జిన్నింగ్ మిల్లుల్లో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. నర్సింగ్ హోమ్‌లల్లో ఐటీదాడులు కలకలం రేపాయి. దాడుల విషయం తెలుసుకున్న కొందరు వైద్యులు ముందు జాగ్రత్తలు తీసుకొన్నారు. రోగుల నుంచి ముక్కు పిండి ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు, అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...