హరితహారంపై నిర్లక్ష్యం వద్దు


Wed,March 20, 2019 02:15 AM

తానూర్ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని డీఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన తానూర్, కుభీర్ మండల్లాల్లోని మాలేగాం, సోనారి, గోడాపూర్, కస్రా, చొండి, గొడిసెర, పాంగ్రా, బోల్సా, హిప్నెల్లి, తానూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయాల్లో ఈజీఎస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతీ గ్రామం లో పచ్చదనం పెంచేందుకు హరితహారం కార్యక్రమా న్ని ప్రవేశ పెట్టిందన్నారు. గతంలో మండలంలో ఐదారు నర్సరీలు ఉండేవని, ఈ ఏడాది గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత అధికంగా ఉందని, మొక్కలను కాపాడేందుకు సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిమొక్కనూ బతికించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తొండా ల ఎఫ్‌ఏ విలాస్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఆర్డీవో స్పష్టం చేశారు. నర్సరీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ.. మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని, ఒకవేళ ఎండిపోయినట్లయితే.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. విద్యుత్ సరఫరాలో అంతరా యం కలిగినప్పుడు పలు కారణాలతో మో టార్లు చెడిపోయినప్పుడు నీటిని సరఫరా చేసేందుకు గాను నీటి ట్యాంకులను ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. ప్రభు త్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మరుగుదొడ్లను ఈ నెలాఖరు లోపు లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఉపాధి, ఐకేపీ సిబ్బందిపై వేటు తప్పదన్నారు. ఆయన వెంట ఎంపీడీవోలు శ్రీనివాసరావు, సుముఖం శేఖర్, ఏపీవో సదానందచారి, ఏపీఎం రమేశ్, ఏపీవో దశరథ్, ఈసీ హరిలాల్, టీఏలు, ఎఫ్‌ఏలు, ఐకేపీ సీసీలు తదితరులున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...