స్థానిక ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపండి


Tue,March 19, 2019 02:59 AM

సోన్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితాను జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అతికించామని, జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 20వ తేదీ వరకు తెలుపాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముసాయిదా ఫొటో, ఎలక్ట్రోరల్, వార్డు, గ్రామ పంచాయతీల వారీగా జిల్లాలోని 396 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో 16వ తేదీ నుంచి ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరూ ఓటరు జాబితాలో తమ పేర్లను సరి చేసుకోవాలన్నారు. జాబితాలో ఏమైనా తప్పులుంటే మార్చి 20వ తేదీ వరకు అధికారులు అభ్యంతరాలను స్వీకరిస్తారన్నారు. 20వ తేదీ వరకు సవరణల కోసం జిల్లా పంచాయతీ అధికారికి ఎంపీడీవోలు నివేదిక సమర్పిస్తారని, మార్చి 30న తుది జాబితాను ప్రదర్శిస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. ఏప్రిల్ 11న నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికలకు వివిధ బృందాలను నియమించామని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సీ-విజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అక్రమాలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన యువత ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకునేలా వారిని చైతన్యం చేయాలన్నారు. సమావేశంలో డీపీవో శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...