ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి


Tue,March 19, 2019 02:58 AM

సోన్: ఈనెల 22న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో విధులు నిర్వహించే పీవో, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో చిత్రీకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతీ పోలింగ్ కేంద్రంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిర్మల్, భైంసా ఆర్డీవోలు ప్రసూనాంబ, రాజు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...