తొలి రోజు ఒకే నామినేషన్


Tue,March 19, 2019 02:58 AM

ఆదిలాబాద్ /నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడగా మొదటి రోజు ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ నామినేషన్ వేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దివ్యకు ఆయన తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ సుమన్, మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఆయన నామినేషన్ వేశారు. సోమవారం లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం నాయకులు, కార్యకర్తలను వందమీటర్ల దూరంలో నిలిపివేశారు. నామినేషన్ల స్వీకరణకు గాను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం గంటల వరకు సమయం ఉండడంతో ఉద్యోగులు మినహా ఇతరులను లోనికి అనుమతించలేదు. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 25 వరకు సమయం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్‌లు వేసే అవకాశం ఉంది.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...