ఆరోగ్య సమాజం కోసమే పోషణ్ అభియాన్


Tue,March 19, 2019 02:58 AM

దస్తురాబాద్ : ఆరోగ్యవంతమైన సమాజం కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీల ద్వారా పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నాయని ఖానాపూర్ ఇన్‌చార్జి సీడీపీవో శ్రీలత అన్నారు. మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం పోషణ అభియాన్ పక్షోత్సవాల్లో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం,అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పుట్టిన పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అన్నిరకాల పోషక పదార్థాలను తీసుకోవాలని సూచించారు. బాలామృతం,పాలు,గుడ్లు,కూరగాయలు,పిండి పదార్థాలు అవసరమని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ చిత్రకళ, యూడీసీ పద్మ, జూనియర్ అసిస్టెంట్ స్వప్న,అంగన్‌వాడీ టీచర్లు కృష్ణవేణి, రత్నమ్మ, గీతాంజలి, భారతీ, రాజమణి,గర్భిణులు, ఆయాలు పాల్గొన్నారు

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...