మండల పరిషత్ కార్యాలయంలో చోరీ


Tue,March 19, 2019 02:57 AM

కడెం : కడెం మండలపరిషత్ కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయం బీరువాలో ఉన్న సర్పంచ్‌ల డిపాజిట్ డబ్బులు అపహరణకు గురయ్యాయని ఎంపీడీవో వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి. రోజు మాదిరిగానే సోమవారం కార్యాలయాన్ని సిబ్బంది తెరవగా తాళం పగులగొట్టి వెనుక తలుపు తీసి ఉండడంతో సిబ్బంది సమాచారం మేరకు ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఖానాపూర్ సీఐ ఆకుల అశోక్, కడెం ఎస్సై కృష్ణ కుమార్ చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జాగిలాన్ని రప్పించి నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు. కార్యాలయంలోని బీరువా తీసి ఉండడంతో అందులో ఉన్న సర్పంచ్ డిపాజిట్ 60వేల రూపాయలను దుండగులు అపహరించారు. మరో బీరువాలో ఉన్న 60వేల రూపాయలు అలాగే ఉన్నాయి. డిపాజిట్ డబ్బులు బీరువాలో ఉన్న విషయం సిబ్బందికి మాత్రమే తెలుసని, ఇందులో ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్సై కృష్ణ కుమార్ వివరణ కోరగా ఎంపీడీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...