టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరు


Tue,March 19, 2019 02:57 AM

బజార్‌హత్నూర్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఐదేళ్లలో టీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. సోమవారం మండలంలోని తన సొంత గ్రామం జాతర్లలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో మండలంలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆభ్యన్నతికి సీఎం కేసీఆర్ ఎంతోగానో కృషి చేశారని కొనియాడారు. వృద్ధులు, బీడీకార్మికులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీటీ రోడ్లు, రైతుబంధు 24 గంటల ఉచిత కరెంట్ అందజేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ నానం రమణ మాట్లాడుతూ ఇతర పార్టీల నాయకులు చెప్పే మాటలు ప్రజలు వినే స్థాయిలో లేరని గుర్తుచేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అల్కె గణేశ్, నాయకులు పరాచ సాయన్న, పవన్‌కూమర్, సూది నందు, తేలి నారాయణ, లక్కం రాములు, జైవంత్‌రావు, వినోద్, వెంకన్న, భోజారెడ్డి, ప్రసన్నరావు, జాంసింగ్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...