నిర్భయంగా ఫిర్యాదు చేయండి


Tue,March 19, 2019 02:56 AM

నిర్మల్ క్రైం: పోలీసు సహాయం కావాలనుకునే వారు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు సోమవారం ఎస్పీకి ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైనప్పుడు పోలీసు స్పందనపై దృష్టి సారిస్తానని అన్నారు. ఫిర్యాదుదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మంచి మార్గంలో ఉన్న ప్రజలకేనని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలో విజువల్ పోలీసింగ్ కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే స్థానికులు వారిపై దాడులకు పాల్పడకుండా వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రజల్లో పోలీసు వ్యవస్థపై మరింత గౌరవం పెరిగేలా కృషి చేస్తున్నామని అన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...