కడెంలో అసలేం జరిగింది సినిమా చిత్రీకరణ


Mon,March 18, 2019 02:29 AM

కడెం : శ్రీరాం, సంచితా పడుకునే హీరో, హీరోయిన్లుగా ఎక్సోడస్ మీడి యా నిర్మిస్తున్న అసలేం జరిగింది సినిమా సెకండ్ షెడ్యూల్‌ను కడెం మండలంలోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభించిన షూటింగ్ మూడు రోజుల పాటు కడెం జలాశయం, హరిత రిసార్ట్, ప్రాజెక్టు ప్రధాన కాలువ, మండలంలోని పెద్దబెల్లాల్ సమీపంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా సినిమా చిత్రీకరణ నిర్వహించారు. పలు సన్నివేశాలు, పాటల చిత్రీకరణ చేపట్టారు. కడెంలో రెండు పాటలతో పాటు, ైక్లెమాక్స్ సీన్స్, పోరాటాలు, సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాల్ని ఈ షెడ్యూల్‌లో షూట్ చేసినట్లు నిర్మాత కె. నీలిమా తెలిపారు. లవ్, సస్పెన్స్ బ్యానర్ కింద నిర్మితమయ్యే ఈ సినిమా తమకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని హీరో హీరోయిన్లు శ్రీరాం, సంచితాలు తెలిపారు. కో-ప్రొడ్యూసర్ కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ... పాటల కోసం విదేశాలకు వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రంలోని అందమైన లోకేషన్లలో పాటలు చిత్రీకరించాలని భా వించి ఇక్కడ అందాలతో తెరకెక్కిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను గుర్తించి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తు న్న క్రమంలో అలాంటి సహజసిద్ధమైన అందాలను ప్రేక్షకులకు చూపించాలని బావించి ఈ ప్రాంతంలో పాటలను చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇది అందమైన ప్రేమకథ సినిమా, పల్లె ప్రాంతాల్లోని మంచి అందాలను సైతం పాటల్లో చిత్రీకరించినట్లు డైరెక్టర్ రాఘవ తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...