ఛత్రపతి ఆశయాలను నెరవేర్చాలి


Mon,March 18, 2019 02:29 AM

కుభీర్: ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా యువత పయణించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని పాంగ్రా గ్రామంలో ఛత్రపతి శివాజీ నూతన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పా టుచేసిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ.. జాతీయవాదం, దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన పరామక్రముడని పేర్కొన్నారు. ప్రజల కోసమే.. ప్రభుత్వమేనే నినాదంతో గూడాచార వ్యవస్థను తయారు చేసుకొని వ్యక్తిగత విలాసాలకు దూరంగా ఉంటూ..ప్రజలకు సేవ చేసిన ఘనత శివాజీకే దక్కుతుందన్నారు. తల్లిదండ్రులను ఎంతో గౌరవించిన శివాజీ అపారమైన దైవభక్తితో జగదాంబ అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్న దైవభక్తుడని అన్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూజలు చేసి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోశెట్టి, మాజీ సర్పంచ్ దిగంబర్ పటేల్, హిందూవాహిణి కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...