వన్య ప్రాణుల దాహార్తి తీరేలా..


Mon,March 18, 2019 02:29 AM

ఖానాపూర్: వేసవి కాలంలో వన్య ప్రాణుల సంరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో వన్యప్రాణుల తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో వాటర్ కీహోల్స్‌తో పాటుగా వాటర్ సాసర్‌లను ఏర్పాటుచేయగా, ఈ సంవత్సరం ఆ విధానం కొన్ని మార్పులు తీసుకువచ్చారు. సాసర్లు ఉన్న చోట ఆడవుల్లో జంతు సంచారం ఉన్న ప్రాంతా ల్లో రింగులు వేసి నీటి తొట్టెలు అమర్చారు. మొత్తం రేంజ్ పరిధిలో 30 చోట్ల 60 వాటర్ రింగులను ఏర్పా టు చేశారు. ఖానాపూర్ రేంజ్ పరిధిలో మస్కాపూర్, సుర్జాపూర్, ఇక్బాల్‌పూర్, మందపెల్లి, సత్తెనపల్లె, నాగాపూర్ తదితర అటవీ ప్రాంతాల్లోని పది చోట్ల 15, పెంబి రేంజ్‌లో మరో 20 తొట్టెలను ఏర్పాటు చేశారు.

నీటి తేమ ఉండే ప్రాంతాల్లో కీ హోల్స్ ను జేసీబీతో తవ్విస్తున్నారు. ప్రతివారం ఆ కీ హోల్స్ చెలిమలను శుభ్రం చేయిస్తున్నారు. నీటి జాడలు వెతుక్కుంటూ అడవుల్లో తిరుగాడే జీవరాశులు గ్రామాల్లోకి తాగునీటి కోసం రావచ్చని అటవీశాఖ ముందే భావించింది. అలా వచ్చే జంతువులకు వేటగాళ్ల నుంచి ప్రమాదం ఉంటుందని అటవీశాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అవి తిరిగే చోటనే తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. పెంబి, ఖానాపూర్, ఎక్బాల్‌పూర్ తదితర గ్రామాల్లో జంతువులు గతంలో నీటి కోసం గ్రామాల్లోకి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమం లో ఖానాపూర్ సబ్‌డివిజన్ పరిధిలోని, కడెం, పెంబి, మామడ రేంజ్ అడవుల్లో నీటి వసతి కల్పించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. సుర్జాపూర్ కొత్తవాడలో ఎగువ ప్రాంతంలోని అడవిలో ఒక రాతిగుట్టను ఆసరాగా చేసుకొని కేవలం రూ. 70 వేలతో ఒక చెరువును గతేడాది తవ్వించారు. ఈ చెరువు జంతువుల తాగునీటి దాహార్తి తీర్చిడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. ప్రస్తుతం అడవుల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో రోజు విడిచి రోజు ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...