ఎన్నికల సిబ్బంది


Mon,March 18, 2019 02:28 AM

-సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
భైంసా, నమస్తే తెలంగాణ : లోక్‌సభ ఎన్నికల కోసం నియామకమైన అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని సరస్వతీ జూనియర్ కళాశాలలో పీవో, ఏపీవోలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని లోక్‌సభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పారదర్శకంగా పోలింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌లు, ఎం-3 ఉండగా.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఎం-2 రకమైన యంత్రాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పొరపాట్లు జరుగకుండా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6 గంటల వరకే ఈవీఎం, వీవీప్యాట్‌లను అందుబాటులో ఉంచాలని, పోలింగ్ ముగిసిన తరువాత ఈవీఎంలను ఎలా భద్రపరచాలో వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజు, భైంసా తహసీల్దార్ రాజేందర్, ఆయా మండలాల తహసీల్దార్లు, సిబ్బంది తదితరులున్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...