అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు


Mon,March 18, 2019 02:28 AM

ఉట్నూర్, నమస్తేతెలంగాణ : అడవుల జిల్లా ఆదిలాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణ అటవీ ప్రాంతమే. కానీ రాను రాను అడవులు తగ్గడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అడవుల శాతం చాలా తగ్గింది. వీటికి తోడు వన్య ప్రాణుల వేట ప్రభుత్వంలో కదలికలు తెచ్చింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. అటవీ సంపదను కొల్లగొడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. ఇంటి దొంగలను సైతం వదలవద్దని ఆదేశించడంతో అటవీ దొంగల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ సంరక్షణకు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

అడవిలోకి వెళ్లకుండా చర్యలు
ఉట్నూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా స్పెషల్ పార్టీ పోలీసులు, ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో మండలంలోని కొమ్ముగూడ వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటుచేశారు. నిరంతరగస్తీ ఏర్పాటు చేయడంతో పాటు అడవి నుండి ఏ వస్తువును తీసుకరాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదీ కాక రాత్రి వేళలో సెక్షన్ అధికారి ఆధ్వర్యంలో ఇద్దరు బీట్ అధికారులు, బేస్ క్యాంపు బృందాలు గస్తీ తిరుగుతున్నాయి. ఫారెస్ట్ సమీపంలోని ప్రజలు అడవిలోకి వెళ్లకుండా భారీ కందకాలను తవ్విస్తున్నారు. అడవులను కాపాడాలనే ఉద్దేశంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. అడవులు తగ్గడంతో కావాల్సిన ఆహారం దొరకక కోతులు సైతం గ్రామాలకు వస్తున్నాయి. మళ్లీ కోతులను అడవులకు పంపే ఉద్దేశంతో అడవిలో పండ్ల మొక్కలు పెంచుతున్నారు.

స్మగ్లర్లపై నిఘా
అటవులను కాపాడడంతో పాటు స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పట్టణంతో పాటు గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల దాడులు నిర్వహించి కలప స్వాధీనం చేసుకున్నారు. కలప తరలిస్తున్నవారిపై కేసులు నమోదుచేశారు. కలప వాడకం నిరోధించేందుకు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ధికారుల చర్యలు ఫలిస్తుండడంతో స్థానికులు ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...