వినియోగదారులను మోసం చేస్తే చర్యలు


Mon,March 18, 2019 02:27 AM

ఇంద్రవెల్లి : వ్యాపారస్తులు వినియోగదారును మోసం చేస్తే చర్యలు తీసుకుంటామని ఆల్ ఇండియా కన్జ్యూమర్ వెల్ఫేర్ కౌన్సిల్ (ఏఐసీఎఫ్) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అమృత్‌రావ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వినియోగదారుల హక్కుల రక్షణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కెట్‌లో వ్యాపారస్తులు విక్రయిస్తున్న వస్తువులతోపాట నిత్యవసర సరుకుల్లో నాణ్యతను పాటించాలన్నారు. నాణ్యత లేని వస్తువులు విక్రయించి వినియోగదారులకు వ్యాపారస్తులు మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వినియోగదారుల హక్కులకు రక్షణ కల్పించడానికి 1986లో ప్రత్యేక చట్టాన్ని తీసుకోచ్చారన్నారు. త్వరలోనే ఇంద్రవెల్లి మండలంలో వినియోగదారులతో నూతన కమిటీను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి గంగన్న, ఈర్లా స్వామి, ఆశోక్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...