శారద జిన్నింగ్ ఫ్యాక్టరీ సీజ్


Sun,March 17, 2019 02:57 AM

ఆదిలాబాద్ టౌన్: బల్దియా ఆస్తి పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో శనివారం బల్దియా అధికారులు శారద జిన్నింగ్ ఫ్యాక్టరీతో పాటు జబ్బార్‌కు చెందిన సౌండ్ సిస్టమ్ షాపును సీజ్ చేశారు. ఆస్తి పన్ను వసూళ్లలో భా గంగా రెవెన్యూ అధికారులు బకాయిలు వసూ లు చేస్తున్నారు. వడ్డెర కాలనీలోని శారద జిన్నింగ్ ఫ్యాక్టరీ రూ.49వేలు, జబ్బార్ సౌండ్ సిస్టమ్ పన్ను రూ.1.06లక్షలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు అందించారు. స్పందించకపోవడంతో సిబ్బందితో కలిసి ఫ్యాక్టరీకి, షాపునకు తాళం వేసి సీల్ వేశారు. ఈ సందర్భంగా బల్దియా రెవెన్యూ అధికారి గంగాధర్ మాట్లాడుతూ.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బల్దియాకు రూ.5.06కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉందన్నారు. ఇప్పటి వరకు 70శాతం వరకు పన్నులు వసూలయ్యాయన్నారు. ఈ నెలాఖరులోగా వాణిజ్య, వ్యాపార, గృహ సముదాయా ల వారు తమ ఆస్తి పన్ను బకాయి ఉంటే వెంటనే చెల్లించాలని కోరారు. ఆర్‌వో వెంట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...