ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు


Sun,March 17, 2019 02:56 AM

నిర్మల్ క్రైం : పార్లమెం ట్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయం శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతవాతావరణంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా బెల్టు షాపులు కొనసాగితే సీజ్ చేయాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా గతంలో ్ల గొడవల కు పాల్పడిన వారిని బైండోవర్ చేయాలని సూచించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది కచ్చితంగా ఎన్నికల నియమావళిని పాటించాలని అన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా సిబ్బంది కేటాయింపునకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉండాలని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ దక్షిణమూర్తి, డీఎస్పీలు ఉపేందర్‌రెడ్డి, రాజేశ్‌బల్లా, అధికారులు కరీం, జాన్‌దివాకర్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్‌కుమార్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...