ఆన్‌లైన్ నమోదులో అలసత్వం వద్దు


Sun,March 17, 2019 02:55 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ: ప్రజల ఆరోగ్య సమాచారం, గర్భిణుల వివరాల ఆన్‌లైన్ నమోదులో అలసత్వం చేస్తే చర్యలు తప్పవని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం సాయంత్రం ఉమ్మడి జిల్లా పరిధిలోని 31 మండలాల వైద్యులు, సూపర్‌వైజర్లతో ఐటీడీఏ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు కృషిచేయాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఓపీ రిజిష్టర్ ఉంచాలన్నారు. వెంటనే ఆన్‌లైన్‌లో నమోదుచేయాలన్నారు. ఫార్మసిష్టు రిజిష్టర్‌కు మ్యాచింగ్ కావాలన్నారు. గర్భిణులను గుర్తించిన 18 వారాల్లోపు ఆన్‌లైన్‌లో ఏఎన్‌ఎం ద్వారా వివరాలు నమోదుచేయాలన్నారు. 50 శాతం కన్నా తక్కువ చేసిన ఏఎన్‌ఎంకు వైద్యాధికారి సోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. సూపర్‌వైజర్‌కు, వైద్యుడికి డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ద్వారా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

టీబీ కార్యక్రమంలో తక్కువగా ఆన్‌లైన్ నమోదు చేసిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి సోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. దవాఖానల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ నిర్వహించాలన్నారు. వేసవికాలం ఉన్నందున దవాఖానకు వచ్చే రోగులకు చల్లటి నీటిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి గ్రామంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందించాలన్నారు. పౌష్ఠికాహార లోపం ఉన్న పిల్లలను ఉట్నూర్‌లోని పౌష్ఠికాహార కేంద్రానికి తరలించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, వైద్యసిబ్బందికి సూచించారు. వైద్యాధికారులు డ్రెస్‌కోడ్ తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి రాజీవ్‌రాజ్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి తొడసం చందు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో వసంత్‌రావు, కొమురం బాలు, అనీత, వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, వైద్యసిబ్బంది ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...