కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపండి


Sun,March 17, 2019 02:54 AM

ఖానాపూర్: కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని, జంతు సంరక్షణపైనా దృష్టి పెట్టాలని జిల్లా అటవీ ముఖ్య సంరక్షణాధికారి సీపీ వినోద్ కుమార్ అన్నారు. ఖానాపూర్‌లోని కలప లాగింగ్ డిపోలో శనివారం నిర్మల్ జిల్లా స్థాయి బేస్ క్యాంప్ సెక్యూరిటీ గార్డులతో జిల్లా అటవీ ముఖ్య సంరక్షణాధికారి సీపీ వినోద్ కుమార్, ఇతర అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 8 ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలోని సిబ్బంది హాజరయ్యారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ గతంలో కొన్ని పరిస్థితుల కారణంగా అడవిని కాపాడడంలో అటవీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది అనేక రకాల ఒత్తిళ్లకు లోనయ్యారని అన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, స్వయంగా ముఖ్యమంత్రి అడవిని కాపాడేందుకు అటవీ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారన్నారు. అడవిలో చెట్లు నరికివేతకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఇప్పుడు అటవీ సిబ్బందిపై ఎలాంటి ఒత్తిళ్లు ఎదురుకావని, రాజకీయనాయకుల తాకిడి కూడా ఉండబోదన్నారు. కలప స్మగ్లింగ్‌కు సంబంధించి ఎంతటివారినైనా ఉపేక్షించే ప్రసక్తే ఉండబోదన్నారు. అటవీ శాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు నిరక్ష్యం ప్రదర్శిస్తే ఎలాంటి సంజాయిషీ అడగకుండా నేరుగా ఇంటికి పంపిస్తామని, ఈ విషయాన్ని కింది స్థాయి ఉద్యోగుల నుంచి రేంజర్ల వరకు గుర్తుంచుకోవాలన్నారు. కలప స్మగ్లింగ్‌లో అటవీ శాఖ సిబ్బంది హస్తం ఉన్నట్లు తేలితే ఉద్యోగం పోవడమే గాకుండా క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కలప స్మగ్లర్ల దాడుల నుంచి సిబ్బందిని కాపాడేందుకు పోలీసు శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని అన్నారు. అడవిలో అటవీశాఖ, తుపాకులతో పోలీసులు సంయుక్తంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసులు కూడా అటవీ రక్షణలో పాలుపంచుకోవాల్సిందేనని వినోద్‌కుమార్ అన్నారు.

జంతు వేటను ఆపండి
అడవిలో స్వేచ్ఛగా తిరిగే వణ్యప్రాణులను వేటగాళ్లు కరెంటు పెట్టి, బరిసెలతో పొడిచి అత్యంత కిరాతకంగా చంపుతున్నారని, అలాంటి వ్యక్తులపై ఒక కన్నేసి ఉంచాలన్నారు. అడవులతో పాటుగా అడవిలో సంచరించే వణ్యప్రాణులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అటవీశాఖదేనని వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ నడుస్తున్నందున అడవిలో నీటి కొరత ఉంటుందన్నారు. జంతు సంచారం ఉన్న చోట కృత్రిమ నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. అడవిలో నీరు ఏర్పాటు చేస్తే తాగునీటి కోసం జంతువులు జనావాసాల్లోకి రావని, చాలా సందర్భాల్లో నీరు కోసం రోడ్లు దాటుతూ, ప్రమాదాలకు గురై జంతువులు చనిపోతున్నాయని, ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని కన్జర్వేటర్ సూచించారు. సమావేశంలో నిర్మల్ జిల్లా డీఎఫ్‌వో ప్రసాద్, నిర్మల్ ఎఫ్‌డీవో గోపాల్‌రావు, ఖానాపూర్ ఎఫ్‌డీవో తిరుమల్‌రావు, ఖానాపూర్, పెంబి రేంజర్ వినాయక్, కడెం రేంజర్ రాథోడ్ రమేశ్, ఉడుంపూర్ రేంజర్ ఎల్. రమేశ్, మామడ, దిమ్మదుర్తి రేంజర్, ప్రణీత్‌కౌర్, బేస్ క్యాంపు, ైస్ట్రెకింగ్ సిబ్బంది పాల్గొన్నారు

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...