గేట్‌లో మెరిసిన తానూర్ యువకుడు


Sun,March 17, 2019 02:53 AM

-ఆలిండియా స్థాయిలో 53వ ర్యాంకు
భైంసా,నమస్తే తెలంగాణ : గేట్-2019 ఫలితాల్లో తానూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కదం కృష్ణప్రకాశ్‌రావు ప్రతిభ కనబరిచాడు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో 53వ ర్యాంకు (91.33) సాధించాడు. కృష్ణప్రకాశ్ ఐదవ తరగతి వరకు భైంసాలో, ఆరు నుంచి పదవ తరగతి వరకు కాగజ్‌నగర్‌లోని నవోదయ పాఠ శాలలో, హైదరాబాద్‌లో ఇంటర్ విద్యనభ్యసించి గోవా ఎన్‌ఐటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుని మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా స్థాయిలో 53వ ర్యాంకు సాధించిన కృష్ణప్రకాశ్‌ను పట్టణంలోని శ్రీనిధి చిట్‌ఫండ్స్ ఫైనాన్స్ మేనేజర్ నవనీత్‌రావు, శ్రీమేధా పాఠశాల డైరెక్టర్ జే.కే పటేల్ శనివారం ఘనంగా సన్మానించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...