మార్కెట్ యార్డుల్లో సౌకర్యాలు కల్పించాలి


Sun,March 17, 2019 02:53 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : మార్కెట్ యార్డుల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని ఆదిలా బాద్ జిల్లా సంయుక్త కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు లో శనగల కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో శనగల కొనుగోళ్లను ప్రారంభించాలని మార్క్‌ఫెడ్ అధికారులకు ఆదేశించారు. ముందస్తుగా మండలాలు, గ్రామాల వారీగా రైతులకు తేదీలను ఇచ్చి ఆ తేదీలోనే శనగలను కొనుగోలు చేయాలని సూచించారు. కొ నుగోళ్లలో ఎలాం టి అవకతవకలు జరుగకుండా చూ డాలన్నారు. అసలైన రైతుల నుంచే శనగలను కొనుగో లు చేయాలని సూ చించారు. దళారు ల ప్రమేయం లే కుండా చూసే బా ధ్యత అధికారులపై ఉందన్నారు. రైతు లు శనగలను ఆరబెట్టుకొని మార్కె ట్ యార్డుకు తీసుకొచ్చి మంచి ధరను పొందాలని తెలిపారు. నిబంధనల మేరకు తీసుకొస్తే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందన్నారు. దళారులకు తక్కువ ధరకు శనగలను అమ్ముకొని మోసపోవద్దని, ప్రభుత్వ రంగ సంస్థలకే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే మార్కెటింగ్ శాఖ అధికారులను లేదా మార్క్‌ఫెడ్ అధికారులను సంప్రదించాలన్నారు. జేసీ వెంట మార్క్‌ఫెడ్ మేనేజర్ పుల్లయ్య, మార్కెటింగ్ శాఖ అధికారులు ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...